రెచ్చగొట్టే రాజకీయాలతో జగన్‌ యాత్ర: సోమిరెడ్డి

share on facebook

నెల్లూరు,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): ప్రతిపక్ష నేత జగన్‌ రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ది కానీ రెచ్చగొట్టే రాజకీయాలు కాదన్నారు. కాబోయే ముఖ్యమంత్రిని తానే అంటూ జగన్‌ ప్రజరం చేసుకోవడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌ జైలుకు వెళ్లడం తప్ప రాజకీయంగా ఇక ముందుకు సాగలేరని బుధవారం నాడిక్కడ అన్నారు.
రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ  జగన్‌ను విశ్వసించరని  స్పష్టం చేశారు. జగన్‌ అవినీతిని, కుటుంబ ఫ్యాక్షన్‌ ధోరణిని ఛీకొట్టిన ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టి మూడున్నర సంవత్సరాలు గడిచినా ఇంకా ఎలాంటి
మార్పు ఆయనలో రాలేదన్నారు. పాదయాత్ర పేరుతో విద్యార్థులు, ప్రజలను పక్కదారి పట్టిస్తోన్నారని తెలిపారు. వైసీపీ నేతలు నిరంతరం అభివృద్ధిని అడ్డుకొంటూ విద్వేష రాజకీయాలు నడుపుతోన్నారని చెప్పారు. అభివృద్ధిలో ఏపీ అన్ని రాష్టాల్ల్రో కంటే ముందువరుసలో ఉందన్నారు. దీనికి సీఎం చంద్రబాబు కఠోర శ్రమే కారణమన్నారు.  జగన్‌ అక్రమాస్తుల కేసులో ఈడీ స్వాధీనం చేసుకొన్న ఆస్తులపై ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ  ప్రగతి పథంలో నిలపాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని  పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో సమస్యలు పరిష్కరించే అనుభవజ్ఞులైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రోజులో 16 గంటలపాటు ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. పట్టిసీమ పథకం ద్వారా నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు సాగునీటి జలాలను అందించి రైతులను ఆదుకున్నారని అన్నారు. గోదావరి జలాలను ఏలేరు అనుసంధానం చేసేందుకు   కార్యాచరణ జరిగిందన్నారు. రాష్టాన్న్రి అభివృద్ధి పరిచేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ హావిూలను నెరవేర్చారన్నారు. ఎన్నికల ముందు ప్రతి కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పి కుటుంబంలో అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.1000, రూ.1500లు ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలిచారన్నారు.

Other News

Comments are closed.