రెప్పపాటులో రైలు ప్రమాదం

share on facebook

పట్టాలపై కబుర్లుచెప్పుకుంటున్న ఆరుగురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
లక్నో,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): పట్టాలపై కాలక్షేపం కబుర్లతో మునిగిన కొందరు ప్రయాణికుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. రైలు రావడాన్ని కూడా గమనించకుండా అలాగే ఉండిపోవడంతో..రైలు రావడం..వారిని గుద్దడం ఓణాల్లో జరిగిపోయింది. దీంతో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఉత్తరప్రదేశ్‌ లోని సాధిక్‌ పూరలో జరిగిన ఈ ఘటనలో  ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే స్టేషన్‌ సవిూపంలో పట్టాలపై వీరంతా కూర్చోని ముచ్చటిస్తుండగా.. ట్రైన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డవారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. రైలు ఆలస్యం కావడంతో.. కొందరు ప్రయాణికులు పట్టాలపై కూర్చున్నారు. అదే సమయంలో ట్రైన్‌ రావడాన్ని వారు గుర్తించకపోవడంతో ప్రమాదం జరిగింది. వెంటనే రైల్వే రక్షకదళం బాడీలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌ మార్టమ్‌ కోసంపంపారు.

Other News

Comments are closed.