రేవంత్‌ పోరాటానికి బాబు పరోక్ష మద్దతు?

share on facebook

నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌ రెడ్డి జవసత్వాలు నింపుతారా, కొడిగడుతున్న దీపాన్ని వెలిగిస్తారా అన్నది ఇప్పుడు తాజాకీయాల్లో చర్చగా మారింది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమయ్యింది. ఇంతకాలం కాంగ్రెస్‌ చేస్తున్న కార్యక్రమాలు, పోరాటం తెలంగానలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్యగానే చూడాలి. ఇప్పుడున్న నేతలు సిఎం కెసిఆర్‌ను ఢీకొనలేక చతికిల పడుతున్నారు. జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌లకు పార్టీ శ్రేణులను కదిలించగలిగే శక్తి చాలడం లేదు. ఎఐసిసి కూడా దీనిని గుర్తించినట్లు రేవంత్‌ వ్యవహారం చూస్తుంటే అర్థం అవుతోంది. గ్రూపులు,వర్గాలుగా ఉన్న కాంగ్రెస్‌ను ఏకతాటిపైకి తీసుకుని వచ్చి రేవంత్‌ ముందుకు తీసుకుని వెళ్లేలా ఆయనకు అధికారాలు అప్పగిస్తారా అన్నది సందేహం. అలా అప్పగిస్తే ప్రస్తుత నేతలు అంగీకరిస్తారా అన్నది కూడా సందేహమే. ఇకపోతే రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరి కెసిఆర్‌ను ఢీకొనేందుకు టిడిపి అధినేత చంద్రబాబు కూడా పరోక్షంగా సహకరిస్తున్నారా అన్నది అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్లిపోయేలా సాదాసీదా వ్వయమారంగా సాగిన తీరు అనుమానాలను బలపరుస్తోంది. ‘ఇప్పుడే నిజమైన ఆట మొదలైంది..’ అని రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు ఓ రకంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం వహించనున్నారని స్పష్టం చేస్తున్నాయి. రెండు సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలను వదిలి ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదని మరోవైపు రేవంత్‌ స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నన్నాళ్లు కొడంగల్‌ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను మృతి చెందాకే సమాధి కూడా ఇక్కడే నిర్మిస్తారని ఉద్వేగంగా మాట్లాడారు. కొడంగల్‌ దొరల కోటలను కూల్చినట్టుగానే కేసీఆర్‌ గోడలను కూల్చుతానని స్పష్టం చేశారు. కొడంగల్‌ నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు తమ కార్యకర్తలను పార్టీలో చేర్చుకునేందుకు డబ్బు మూటలు పట్టుకొని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఇకపోతే టిడిపి నుంచి రేవంత్‌ వెల్లిపోవడం వెనక బాబు వ్యూహం ఏమైనా ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి. రేవంత్‌ వెళ్లిపోవడం సాధారణ ప్రక్రియగానే సాగింది. ఆయనను నిలువరించే ప్రయత్నాలు చేయలేదు. అలాగే కెసిఆర్‌ను ఢీకొనేందుకు చంద్రబాబు ఇలా వ్యూహం పన్నారా అన్నది కూడా చర్చి సాగుతోంది. సహజంగా ఎవరైనా పార్టీలో ఉండేవాళ్లకు..ఉన్న వాళ్ళకు గౌరవం ఇస్తారు. బయటకు వెళ్లే వాళ్ళపై ఉన్నవి లేనివికలిపి తీవ్ర ఆరోపణలు చేస్తారు. కానీ తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయం మాత్రం డిఫరెంట్‌ గా ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసొచ్చిన రేవంత్‌ రెడ్డిని సస్పెండ్‌ చేయాలని..పార్టీ అనుమతి లేకుండా ఇలా చేయటం సరికాదని తెలంగాణ తెలుగుదేశం నేతలు చేసిన సూచనలు ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన చంద్రబాబు ఇవేవిూ పట్టించుకోకుండా రేవంత్‌ రెడ్డికి తనంత తానుగా రాజీనామా చేసే వెసులుబాటు కల్పించారు. దీంతో ఆయన గౌరవప్రదంగా పార్టీ నుంచి తప్పుకున్నట్లు అయింది. ఇకపోతే రేవంత్‌ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయటం, గన్‌మెన్లను అప్పగించడం ద్వారా ప్రజల్లో మంచి ఇమేజ్‌ పొందారు. ఇకపోతే ఈ వ్యవహారాలను అధికార టిఆర్‌ఎస్‌ తనకు అనుకూలంగా మలచుకునేందుకు వ్యూహాలు పన్ననుంది. కొడంగల్‌ టిడిపిఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి అసెంబ్లీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేపద్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ దీనిని ఏ రకంగా స్వీకరిస్తుందన్న చర్చ జరుగుతోంది.రేవంత్‌

రాజీనామా ఆమోదం పొందితే త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఎపిలో తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నికలో గెలిచిన మాదిరి ఇక్కడ కూడా టిఆర్‌ఎస్‌ గెలిస్తే మంచి కిక్‌ వస్తుందన్న భావనలో టిఆర్‌ఎస్‌ అదినాయకత్వం ఉంది. ఇద ఇపార్టీ శ్రేణులరు కెసిఆర్‌ నాయకత్వం పట్ల ఉన్న ఇమేజ్‌ పెంచడానికి తోడ్పడుతుంది. ఇప్పటికే పలువురు మంత్రులు కొడంగల్‌ విూద దృష్టిపెట్టి,టిడిపి,ఇతర పార్టీల నుంచి మండల,ఆ కింద స్థాయి నేతలు, కార్యకర్తలను టిఆర్‌ఎస్‌ లో చేర్చుకునే పనిలో పడ్డారు. ఎట్టి పరిస్థితిలో ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ గెలిచేలా వ్యూహం చేపట్టారు. టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడం ప్రతిపక్షానికి కష్టం అవుతుందని అంటున్నారు. అయితే కాంగ్రెస్‌ మాత్రం రేవంత్‌ వ్యూహాలపైనా, ఆయన నాయకత్వం పైనా నమ్మకంతో ఉందని సమాచారం. టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి చేరికను పార్టీ నేతలంతా స్వాగతించాల్సిందేనని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డి చేరికపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ తదితరులు కుంతియాతో వేర్వేరుగా భేటీ అయ్యారు. వీరంతా ఎలా స్పందించారన్నది తెలియకున్నా రాహుల్‌ ఆదేశాల మేరకు రేంవత్‌కు పెద్ద బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కొడంగ్‌లో రాజకీయాలు మారుతు న్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ స్కెచ్‌లో భాగంగా సవిూకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డే లక్ష్యంగా వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. ఓ వైపు రేవంత్‌ తన అనుచరులతో మంతనాలు జరుపుతుండగా.. మరోవైపు నియోజకవర్గంలోని మరికొందరు కారు ఎక్కేశారు. సీఎం కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్న రేవంత్‌ను నియోజకవర్గంలో బలహీనం చేసేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు భారీ కసరత్తు చేస్తున్నారు. కొందరు నేతలు మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు రేవంత్‌ వెంట జిల్లా స్థాయి నేతలు కూడా వెళ్లకుండా ఎక్కడిక్కడ కట్టడి చేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ వేస్తున్న స్కెచ్‌లో భాగంగా సవిూకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మొత్తానికి కొడంగల్‌ ఉప ఎన్‌ఇనక జరిగితే తప్ప అసలు రాజకీయం మొదలవ్వదు.

Other News

Comments are closed.