రైతుబంధు దేశానికే ఆదర్శం

share on facebook

గతంలో ఎవరు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపి కవిత
నిజామాబాద్‌,మే15(జ‌నం సాక్షి): రైతుబందు పథకంతో తెలంగాణ కొత్త చరిత్రను లిఖించిందని నిజామాబాద్‌ఎంపీ కవిత అన్నారు. గతంలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించయడం ద్వారా దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.  జిల్లాలోని భీంగల్‌ మండలం చేంగల్‌ గ్రామంలో మంగళవారం ఆమె పర్యటించారు. ఎంపీ కవిత రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. అంతకుముందు ఎంపీ కవిత మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, రైతులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి సభా ప్రాంగణానికి ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మహిళా రైతులతో కాసేపు ముచ్చటించారు. రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్లు, 24 గంటల విద్యుత్‌, సాగునీరు, సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడంతో పాటు పెట్టుబడి సహాయం కూడా చేస్తూ దేశంలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నామ చెప్పారు. గతంలో పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు ఏనాడూ రైతులను ఆదుకోలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు నెలల్లోనే భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేసి 94 శాతం భూ వివాదాలను పరిష్కరించామని చెప్పారు. పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశామని అన్నారు. 58 లక్షల మంది రైతులకు 5,730 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తున్నామని తెలిపారు. దేశంలో, ప్రపంచంలో ఎవరూ చెయ్యని సాహసం చేసి సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని  కొనియాడారు. రైతుబంధు పథకానికి బ్యాంకుల్లో నగదు కొరత, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నీళ్లు, కరెంట్‌ అందజేస్తూ ఎరువుల కొరత లేకుండా రుణమాఫీ చేసి నేడు రెండు పంటలకు పెట్టుబడి సహాయం అందజేస్తున్న ఘనత తమదేన్నారు.

Other News

Comments are closed.