రైతుబంధు వినియోగంపై పర్యవేక్షణ ఉండాలి

share on facebook

రైతుల సంక్షేమం కోసం వారు ఆర్థికంగా పురోగమించేలా, నష్టాల బారినుంచి గట్టెక్కేలా తెలంగాణ సిఎం కెసిఆర్‌ వినూత్నంగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. వారికి పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలన ఇ12వేల కోట్లు విడుదల చేసి చెక్కుల రూపేణా పంపిణీ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఊరూరా చెక్కుల పంపిణీ జాతరాలా సాగుతోంది. చెక్కులు అందుకుంటున్న రైతులు వెంటనే నగదుగా మార్చుకుంటున్నారు. అయితే ఈ నగదును రైతులు దుబారా చేయకుండా వ్యవసాయానికి వినియోగించేలా వారిని ప్రోత్సాహించాలి. వ్యవసాయానికే ఖర్చు పెట్టి సాగుద్వారా అనుకున్న లక్ష్యం సాధించే దిశగా వారిని ప్రోత్సహించాలి. పెట్టుబడి చెక్కులు అందించి ఊరుకోకుండా వారు ఆ పెట్టుబడి పథకంతో తగిన విధంగా వ్యవసాయ పనులు చేస్తున్నారా లేదా అన్న నిఘా పెట్టాలి. అందుకు వారిని ప్రోత్సహించేలా చర్యలు

చేపట్టాలి. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఎంతమంచివైనా రైతులు ఆ డబ్బులను దుబారా చేయకుండా క్షేత్రస్థాయిలో వారిని చైతన్యం చేయాలి. పంటలను ఎంచుకోవడం మొదలు విత్తన సేకరణ, ఎప్పుడు ఏ పంట వేయాలి..ఎలా మార్కెట్‌కు తీసుకుని వెళ్లాలి అన్న విషయాలను ప్రభుత్వ అజమాయిషీలోని రైతు కమిటీలు నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేయాలి. ఇందులో రైతుకమిటీలు కీకపసాత్ర పోషించేలా చూడాలి. రైతుల వివరాలను సేకరించి వాటిని ఇంటర్‌నెట్‌లో నిక్షిప్తం చేయడంతో పాటు ఏయే పంటలు ఎక్కడెక్కడ వేయాలన్న ప్రణాళికతో ముందుకు సాగాలి. పెట్టుబడి పొందిన రైతులు ఏయే పంటలు వేశారో దానివల్ల ఎంతవరకు లబ్ది చేకూరిందో కొంతకాలం పర్యవేక్షణ చేస్తే తదుపరి రైతు తనంతగా తాను ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా గ్రామస్థాయిలో అవసరమైతే పంటల వివరాల సేకరణ సాగాలి. దీంతో రైతుల కష్టం వృధా పోకుండా, ఆత్మహత్యలకు తావు లేకుండా, ఆర్థికంగా నిలదొక్కు కునేలా చేసేందుకు చేస్తున్న ప్రయత్నం మరింత సత్ఫలితం ఇస్తుంది. బహుశా ఈ విధానం అమలయితే రైతుకు పూర్వ వైభవం రానుందనడంలో సందేహం లేదు. ప్రణాళికలు బాగున్న అమలులో కూడా పక్కాగ వ్యవహరిస్తేనే ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. దీంట్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే మరింత మంచిది. ఇందులో భాగంగానే దేశంలో ఎక్కడాలేనివిధంగా రైతులకు ఎరువుల కోసం ఎకరానికి ఎనిమిది వేల రూపాయలివ్వాలని నిర్ణయించారు. ఎక్కడా లేనివిధంగా అన్ని ప్రాంతాలలో రైతులను సవిూకరించి సంఘటితం చేసేందుకు రైతుల సంఘాలను ఏర్పాటు చేసారు. రాష్ట్రవ్యాప్తంగా 2200 మంది అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లను నియమిండం ద్వారా వారికి గ్రామాల్లో పని కల్పించారు. రైతుకు రైతు శత్రువు కాకుండా ప్రాంతాలవారీగా క్రాప్‌కాలనీల ఏర్పాటుతో రైతు తన పంటకు తానే ధర నిర్ణయించుకునే రీతిలో వ్యవస్థను రూపొందిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. క్రాప్‌ కాలనీలలో రాష్ట్రానికి అవసరమైన పంటలతోపాటు ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో డిమాండ్‌ ఉన్న పంటలను పండించేలా చూడనున్నారు. మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ కోసం రాష్ట్ర రైతు సంఘానికి ప్రభుత్వం రూ.500కోట్ల నుంచి రూ.1000కోట్ల వరకు ప్రత్యేకనిధిని సమకూరుస్తున్నది. రైతులంతా ఒకేసారి మార్కెట్‌కు సరుకును తీసుకుని రాకుండా గ్రామాల వారీగా దఫదఫాలుగా వచ్చి వారి సరుకును గిట్టుబాటు ధరకు అమ్ముకునేలా ఇప్పటికే అవకాశం కల్పించారు. అంతేగాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా గాకుండా ప్రాసెసింగ్‌ ద్వారా అమ్ముకునే వెసలుబాటును తీసుకుని వస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయబోతున్నారు. ఓ వైపు ప్రాజెక్టులను పూర్తి చేయడం, మరోవైపు నిరంత రాయంగా విద్యుత్‌ లభించేలా చూడడం కూడా ఇందులో

భాగంగా చేసారు. నిత్యం పర్యవేక్షణ, సవిూక్షలు నిర్వహించడం, జిల్లా మంత్రులు కూడా అధికారులు, రైతు సంఘాలతో సమావేశాలు నిర్వహించడం ద్వారా రైతుల్లో భరోసా నింపాలి. అప్పుడే సస్యవిప్లవం దిశగా తెలంగాణ వేస్తున్న అడుగులు శరవేగంగా పడతాయి. తీసుకుంటున్న చర్యలు సాకారం అవుతాయి. భవిష్యత్‌లో తెలంగాణ వ్యవసాయకంగా పురోగమించడం కళ్లకు కనపడుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల కోసం సిఎం కెసిఆర్‌ పడుతున్న తపన ,జరగుతున్న పనులు చూస్తుంటే గోదావరి, కృష్ణమ్మ గలగలలు తెలంగాణ మెట్ట భూములను తడపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల చేపట్టిన ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలాగే హరితహారంతో కోట్లాది మొక్కలు నాటారు. మిషన్‌ కాకతీయతో చెరువులకు మహర్దశ పట్టింది. మిషన్‌భగీరథతో ఇంటింటికీ మంచినీరు రాబోతున్నది. విద్యార్థుల కోసం గురుకులాలు పెట్టారు. గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ ఇలా చెప్పు కుంటూ పోతుంటే ఒక్కో కార్యక్రమానిది ఒక్కో ప్రత్యేకతగా అమలు చేస్తున్నారు. ఇలా ఒక్కో కార్యక్రమం ముందుకు సాగుతు న్న తీరు చూస్తుంటే తెలంగాణ పురోగమించడానికి ఎంతో దూరం లేదని అర్థం అవుతోంది. ఇవన్నీ సాకారం అవుతున్న వేళ అన్నింటికి మించి వ్యవసాయరంగం పురోభివృద్దికి తీసుకుంటున్న చర్యలు తెలంగాణను వ్యవసాయికంగా ముందు నిలుపుతాయనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో రైతులు భవిష్యత్‌లో నీటికోసం ఎదురుచూసే పరిస్థితి రాకుండా సాగునీటి ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా ప్రణాళ

Other News

Comments are closed.