రైతుబీమాతో మరింత భరోసా

share on facebook

సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం

మెదక్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రైతులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం అన్నదాతకు భరోసా అని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు జీవిత బీమా రైతుల కుటుంబాలకు భరోసాను కల్పిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 55లక్షల మంది రైతులకు జీవిత బీమా పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం రూ.ఐదు లక్షల బీమాను ఉచితంగా అందిస్తోందని చెప్పారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నిరంతరం రైతు శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు.రైతులు 60 ఏళ్ల పాటు అరిగోస పడ్డారని, రైతులకు పెట్టుబడి, రైతుబంధు బీమాతో ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో కరంట్‌తో బోరుబావుల మోటర్లు కాలిపోయేవని, ఎప్పుడు కరంట్‌ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం అలా లేదని అన్నారు. ఇప్పుడు రైతులకు 24గంటల నాణ్యమైన కరంట్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ఒక్క మోటారు కూడా కాలిపోవడం లేదని చెప్పారు. గోదావరి జలాలతో పంటలు సాగు చేసుకోవాలనే రైతుల కల.. త్వరలోనే

సాకారం అవుతందని తెలిపారు. కాళేశ్వరం ద్వారా శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌ పునరుజ్జీవ పథకం చరిత్రలో నిలిచి పోనుందన్నారు. 85 టీఎంసీల సామర్థ్యం ఉన్న మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణ పనులనుయుద్ధప్రాతిపదికన చేస్తున్న తీరును కాంగ్రెస్‌ నేతలు వెళ్లి చూడాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తోటపల్లి విూదుగా గౌరవెళ్లి, గండిపల్లి రిజర్వాయర్లకు నీరు వస్తుందన్నారు. తొందరగా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేస్తే రైతుల కష్టాలు తీరుతాయన్నారు. రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందినపుడు సాగు చేసిన పంటలపైనా బీమా చేయించుకోవాలని సూచించారు.

—————-

 

Other News

Comments are closed.