రైతుభరోసా పథకంతో అన్నదాతల్లో ఆనందం

share on facebook

కేంద్ర సాయంతో కలపి రూ.18,500 నగదు జమ
నెల్లూరు,జూన్‌7(జ‌నంసాక్షి):రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ప్రవేశ పెట్టడం సుభ పరిణామం అని జిల్లాలో పలువురు అభిప్రాయపడ్డారు.  రైతుల కష్టాలు, అప్పులు చేసే తిప్పలు తీరనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కలిపి మొత్తం రూ.18,500 నగదు రైతులకు అందనుంది. రైతులు ఆత్మస్థైర్యంతో కాలానుగుణంగా నీటి లభ్యతను బట్టి అనువైన పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీ  వి.సత్యనారాయణ సూచించారు.  వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు, ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడితే మంచి లాభాలు వస్తాయన్నారు. ఆర్థికంగా రైతులను ఆదుకునేందు కోసం ఏడాదికి రూ.12,500 పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.9వేలు సాయం చేస్తూ అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. అయితే ముందుగా రైతుల ఖాతాల్లో రూ.వెయ్యి జమ చేశారు. ఇంతలో ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ పథకం నిలిచిపోయింది. వైసీపీ అధికారంలోకి రావడంతో ఎన్నికల హావిూల్లో భాగంగా నూతన ముఖ్యమంత్రి జగన్‌ రైతు భరోసా పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అక్టోబరు నుంచి ప్రతి రైతు ఖాతాలో రూ.12,500 నగదు జమ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేగాక రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు అవసరమైన వ్యవసాయ స్థిరీకరణ నిధిని రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఎరువులు, పురుగు మందుల
తయారీ, అమ్మకాలలో ఎక్కడా కల్తీ జరగకుండా గట్టి పర్యవేక్షణ ఉండేలా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని  సవిూక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. నూతన ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకంపై జిల్లా రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి రైతుకు భరోసా పెట్టుబడి సాయం అందించాలని మార్గదర్శకాలు విడుదల చేస్తే జిల్లాలో 4.50 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుంది. జూన్‌ చివరిన గాని, జులై నెలలో పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రానున్నట్లు సమాచారం. మొత్తం విూద గత ప్రభుత్వాలతో పోల్చితే రైతులకు భారీగా పెట్టుబడి సాయం పెరిగినట్లు అయింది. కేంద్ర ప్రభుత్వం సాయం రూ. 6వేలుతో కలిపి రూ.18,500 మేర ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం అందనున్నది.

Other News

Comments are closed.