రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోం

share on facebook

ఖమ్మం,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): గిట్టుబాటు ధర కల్పించే విధంగా కవిూషన్‌ వ్యాపారులు శ్రద్ధ తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు అన్నారు. చీటికిమాటికి మార్కెట్లో రైతులు ఆందోళనలు చేయకుండా వారి వెన్నంటి ఉండాలన్నారు. ఒకసారి రైతు పంట కొనుగోలు జరిగిన తరువాత పేచీలు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. కార్మికులు, వ్యాపారులు, అధికారులు, సమన్వయంతో పని చేసి రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన పంటల ధరలపై సవిూక్షించారు. సకాలంలో పంటల క్రయవిక్రయాలు జరిపి వారిని క్షేమంగా ఇంటికి పంపే బాధ్యత అధికారులతో పాటు వ్యాపారులు కూడ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇతర మార్కెట్లలో ఎలాంటి ధర పలుకుతుంది అన్న విషయం రైతులకు తెలిసేవిధంగా యార్డులలో మైకుల ద్వారా ప్రచారం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. పంటల క్రయ విక్రయాలు పారదర్శకంగా, సజావుగా జరగాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించిన సహించేదిలేదని తెలిపారు. రైతన్నలు మార్కెట్‌కు పంటను తీసుకువచ్చిన సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్నారు. రైతు పండించిన పంటలపైనే ఆధారపడి అన్ని వర్గాల వారు జీవనం గడుపుతున్న సంగతి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Other News

Comments are closed.