రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే

share on facebook

సిద్దిపేట,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   రైతుల శ్రేయస్సే తెలంగాణ సర్కారు లక్ష్యమని  ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. అందుకే సమన్వయ సమితులు ఏర్పాటు చేసి ముందుకు వెళుతోందని అభిప్రాయపడ్డారు. యూరియా కొరతకు అనేక కారణాలు ఉన్నాయని అన్నారు.అయినా రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రైతులు ఆందోళనచెందడం సరికాదన్నారు. అన్నదాతలను అన్ని రకాలుగా ఆదుకోవాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నారని వివరించారు. అందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి రైతులకు మేలు చేసేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలో మొదటిసారిగా రైతులను సంఘటితం చేసేందకు తెలంగాణ రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు అందుటులోకి తెచ్చిందన్నారు. సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం కోసం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తుందన్నారు.

Other News

Comments are closed.