రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని మోడీ: చాడ

share on facebook

నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): పెద్దనోట్ల రద్దుతో సామాన్యుల నడ్డి విరిచారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ మోదీ హయాంలో లక్షా 50 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కోమటిరెడ్డి, సంపత్‌ల విషయంలో హైకోర్టు తీర్పును ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రుల్లో చాలా మంది తెలంగాణ ద్రోహులే ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్‌ పథకాలు ప్రచారానికే తప్ప ప్రజల బాగు కోసం కాదని చాడ వ్యాఖ్యానించారు. డబుల్‌ బెడ్రూంఇళ్లు ఇవ్వకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలపై ప్రభుత్వానికి నియంత్రణ లేదన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ను గ్దదె దించేందుకు అన్ని శక్తులు ఏకంకావాలని చాడ పిలుపునిచ్చారు.

 

Other News

Comments are closed.