రైతుల సమస్యలను కెసిఆర్‌ మాత్రమే పరిష్కరించగలరు

share on facebook

రైతుల్లో భరోసా నింపే కార్యక్రమాలు అనేకం చేపట్టారు
ఆర్థికంగా రైతుల ఎదుగుదలకు మార్గం చూపారు
రైతుల ఆందోళనతో విపక్షాలు రాజకీయం మానాలి
మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సూచన
నిజామాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): కేంద్రప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసివుంటే ఇవాళ రైతులు రోడ్డెక్కాల్సిన దురవస్థ వచ్చి ఉండేది కాదని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. తమ ఎంపి కల్వకుంట్ల కవిత పార్లమెంట్‌ వేదికగా అనేకమార్లు దీనిపై పోరాడారని, ప్రధానిని కలసి విన్నివించారని అన్నారు. అయినా బిజెపి నేతలకు రైతుల సమస్య అర్థం కాలేదన్నారు. అందుకే ఇవాళ ఎర్రజొన్న, పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అయినా ఈ సమస్యను కూడా పరిష్కరిస్తానని సిఎం కెసిఆర్‌ ఇటీవల నిజామాబాద్‌ సబావేదికగా హావిూ ఇచ్చారని అన్నారు. ఎన్నికలయ్యాక తాము సమస్య పరిష్కారానికి ముందుకు వస్తామని మంత్రి హావిూ ఇచ్చారు. దేశ చరిత్రలో సీఎం కేసీఆర్‌ అనేక చారిత్రాత్మక నిర్ణయాలు  తీసుకున్నారని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రైతులకు భీమా కల్పించిందని అన్నారు. భీమాతో రైతుల కుటుంబాలకు దీమా కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర రైతుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. దురదృష్టవశాత్తు రైతు మరణించినా, ఆ రైతు కుటుంబంకు వచ్చే రూ. 5 లక్షల భీమాతో ఆర్ధిక భరోసా ఉంటుందన్నారు. రైతుల కష్టాలు, కన్నీళ్లు తుడచడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలోనే మెదటిసారిగా ఇలాంటి పథకం ప్రవేశ పెట్టారని అన్నారు. గతంలో రైతుల సంక్షేమం కోసం ఇన్ని కార్యక్రమాలను అమలు చేసిన దాఖలాలు లేవన్నారు.  రాష్ట్ర రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు ద్వారా ఎకరాకు రూ. 8000 ను అందిస్తున్న ఘనత దేశంలో తెలంగాణలో మత్రమే ఉందన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ వర్తించేలా రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టి వారి కుటుంబాల్లో ధైర్యం కల్పించారని అన్నారు. రైతులు ఆత్మహత్యల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం అందించే సాయంతో పంటలు పండించి ఆర్థికంగా ఎదగాలని  అన్నారు. రైతుల కష్టాలు తీర్చాలనే ఉద్ధేశ్యంతో తెలంగాణ సర్కారు రైతు పక్షాన నిలబడి దేశం గర్విచేలా నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.  రైతు సంతోషంగా ఉన్నాడంటే గ్రామం బాగుందన్నది లెక్క…. అలా రైతులంతా బాగుంటే గ్రామాలు, రాష్ట్రాలు, దేశం బాగుంటుంది. ఈ తరహా ఆలోచన చేస్తే దేశానికి వెన్నముక అయిన రైతుకు మంచిరోజులు వచ్చినట్లే. రైతులను ఆదుకుంటే గ్రామాలను పటిష్టం చేసినట్లే….దేశాన్ని పటిష్టం చేసుకున్నట్లే…గ్రావిూణ ఆర్థిక వ్యవస్థకు రైతు వెన్నముక..గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంతోనే దేశ ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉంది. అందుకే క్రమపద్దతిలో అనేక కార్యక్రమాలను కెసిఆర్‌ అమలు చేస్తున్నారని, జిల్లా రైతుల సమస్యలను కూడా పరిష్కరించి చూపిస్తామని అన్నారు. జిల్లా రైతుల ఆందోళనలను విపక్షాలు ఆసరగా చేసుకుని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. వీరంతా గతంలో ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయారో చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు.

Other News

Comments are closed.