రైతు సంక్షేమంలో వివక్ష తగదు

share on facebook

నల్లగొండ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): రైతు సమస్యలపై తక్షణం స్పందించి ఆదుకోవాలని కిసాన్‌మోర్చా డిమాండ్‌ చేసింది. పెట్టుబడి పథకంతో కౌలురైతులకు మేలు జరగడం కన్నా నస్టం జరుగుతోందని కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు సవరించుకోవాలని అన్నారు. రుణమాఫీతో రైతులకు ఒరిగిందేవిూ లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని మూడవిడతలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన ఫసల్‌భీమా యోజన పథకాన్ని రైతుల దరికి చేరనీయ లేదని పేర్కొన్నారు. తెలంగాణలో కేవలం 3 లక్షల మంది రైతులు మాత్రమే చేరడం విడ్డూరంగా ఉందన్నారు. భారీ వర్షాలకు నరష్టపోయిన రైతులకు వెంటనే ఆదుకోవాలని కోరారు.

Other News

Comments are closed.