రైలులో భారీగా మద్యం స్వాధీనం

share on facebook

కొమురం భీం,మే16(జ‌నం సాక్షి):  తెలంగాణ సూపర్‌ ఫస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది బుధవారం పట్టుకున్నారు. కాగజ్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందుగా  తమకు అందిన సమాచారం మేరకు ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది దాడులు చేసి ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్రాండ్‌లకు సంబంధించిన క్వార్టర్‌ బాటిళ్లు, బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్టు ఆర్‌పిఎఫ్‌ అధికారులు తెలిపారు. వీటిని అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించారు. 

Other News

Comments are closed.