రైల్వేలో వన్‌మెన్‌ ఎలక్షన్స్‌

share on facebook

విజయనగరం,జనవరి23(జ‌నంసాక్షి): వాల్తేరు డివిజన్‌ 20 బ్రాంచ్‌ల సెక్రటరీలు… ప్రెసిడెంట్‌ల ఆధ్వర్యంలో విజయనగరం రైల్వే ఇనిస్టిట్యూట్‌లో బుధవారం ‘ వన్‌ మెన్‌ ఎలక్షన్స్‌ ‘ అంశంపై సమావేశం నిర్వహించారు. బుధవారం ఉదయం విజయనగరం పట్టణం కేంద్రం రైల్వే ఇన్ట్సిట్యూట్‌కు ఈస్టు-కోస్ట్‌ రైల్వే జనరల్‌ సెక్రటరీ ఆర్‌సి.సాహు విచ్చేశారు. ఈ సందర్భంగా రానున్న వన్‌ మెన్‌ ఎలక్షన్స్‌ గురించి సాహు మాట్లాడుతూ… మార్చి నెలలో నిర్వహించనున్న ఎన్నికల్లో విజయం సాధించడానికి రైల్వే కార్మికులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కీ మెన్‌, ట్రాక్‌ మెంటీనర్స్‌, ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంటు, ఎలక్టక్రల్‌ టిఆర్‌డి డిపార్ట్‌మెంట్‌లకు రిస్కు ఎలవెన్స్‌ ఇవ్వాలన్నారు. రైల్వేలో విఆర్‌ తీసుకున్న ఉద్యోగస్తుల వారసులకు ఉద్యోగ అవకాశాలు మళ్లీ పునర్థురించాలని ఎన్‌డిఎ ప్రభుత్వంతో చర్చలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Other News

Comments are closed.