రోజా పుట్టిన రోజు కానుక

share on facebook

రాజన్న క్యాంటీన్‌ ప్రారంభం

చిత్తూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): వైసీపీ ఎమ్మెల్యే రోజా పుట్టురోజు సందర్భంగా ఆమె తన కుటుంబంతో కలసి కేక్‌ కట్‌ చేసి వేడుకను జరుపుకున్నారు. అనంతరం, తన పేరుతో స్థాపించిన రోజా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా రాజన్న క్యాంటీన్‌ లను ప్రారంభించారు. ఈ క్యాంటీన్‌ ల ద్వారా రూ. 4కే భోజనం

అందించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండు మొబైల్‌ క్యాంటీన్లను ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరో రెండు వాహనాలను ప్రారంభిస్తామని చెప్పారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నగరి నియోజకవర్గంలో తన పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకోసం క్యాంటీన్లను ప్రారంభిచడం సంతోషంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యేగా తెలవాలనేదే తన ఆకాంక్ష అని… రాజ్యసభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా ఉండటం తనకు ఇష్టం లేదని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులను కేటాయించనప్పటికీ… నియోజకవర్గ అభివృద్దికి తాము ఎంతో పాటుపడుతున్నామని తెలిపారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే ఇప్పటి వరకు చంద్రబాబు అధికారంలోకి వచ్చారని… ప్రజలనే నమ్ముకున్న జగన్‌ దమ్మున్న నేత అని అన్నారు. జగన్‌ ఏ రోజు కూడా పదవి కోసం ఆరాటం పడలేదని చెప్పారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంటున్న జగన్‌ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

 

 

 

 

Other News

Comments are closed.