రోడ్డుప్రమాదాలపై జాగృతి చైతన్యం

share on facebook

బైకు ర్యాలీతో అవగాహన

సూర్యాపేట,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): రోడ్డు ప్రమాదాల మరణాలను నివారించేందుకు తెలంగాణ జాగృతి సంస్థ చేపట్టిన బైక్‌ ర్యాలీని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్పీ ప్రకాష్‌ జాదవ్‌ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ, అర్వపల్లి , తుంగతుర్తి, నాగారం, తిరుమల గిరి, అడ్డగుడూర్‌ మండలాల్లో పర్యటించి యాదాద్రి జిల్లా మోత్కూరులో ముగియనుంది. కేవలం హెల్మెట్‌ లేని కారణంగా దేశంలో ఏటా లక్షమందికి పైగా ద్విచక్రవాహనదారులు మృతి చెందుతున్నారని జాగృతి నాయకులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాఖీ పండగను పురస్కరించుకుని నిజామబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత చేపట్టిన సిస్టర్స్‌ 4 ఛేంజ్‌ కార్యక్రమం స్ఫూర్తిగా తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లాశాఖ ఈ ర్యాలీ చేపట్టింది. ప్రతి ఒక్క ద్విచక్రవాహనదారుడు విధిగా హెల్మెట్‌ పెట్టుకోవాలని తెలంగాణ జాగృతి కోరింది.

——————

 

 

Other News

Comments are closed.