రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆశ్రమం కూల్చివేత

share on facebook

యాదాద్రి, సెప్టెంబర్‌24 జనం సాక్షి  : రింగ్‌ రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న  హరే రామ  హరే కృష్ణ  ఆశ్రమాన్ని యాదాద్రిలో అధికారులు  కూల్చివేశారు.  రాత్రికిరాత్రే  ఆశ్రమాన్ని తొలగించారు.  కొండ చుట్టూ  వేస్తున్న  రీజనల్‌ రింగ్‌  రోడ్డుకు  అడ్డు వస్తుండడంతో  ఆశ్రమాన్ని తొలగించాలని  అధికారులు గతంలోనే  నిర్ణయించారు. దానికిగాను  కోటిన్నర రూపాయల పరిహారం  అప్పట్లోనే  చెల్లించింది ప్రభుత్వం. అయినా  ఆశ్రమాన్ని నిర్వాహకులు  తొలగించకపోవడంతో అధికారి ఆధ్వర్యంలో  రాత్రి సమయంలో  కూల్చివేత  ప్రారంభించారు. తెల్లారేసరికి ఆశ్రమాన్ని  నేలమట్టం  చేశారు. ఎవరైనా  అడ్డుకుంటారనే  ఉద్దేశంతో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Other News

Comments are closed.