రోహిణికి ముందే ఎండల తీవ్రత

share on facebook

హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): రోళ్లు పగిలేలా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణికి ముందే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గతంతో పోలిస్తే 3 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వడగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో నగరం అగ్నిగోళంలా మారింది. నిప్పుల కుంపటిని ఇంట్లో పెట్టుకున్న మాదిరి భగభగలు నిలువనీయడం లేదు. సూర్యతాపం దెబ్బకు 44 ఏళ్ల రికార్డుకు ఎండలు చేరువయ్యాయి. పగటిపూట అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఈ ఏప్రి/-లోల ఇదే
మొదటి సారి.  సాధారణంగా ఈ సమయంలో 38.1 డిగ్రీలు నమోదుకావాలి. దాదాపు ఐదు డిగ్రీలు ఎక్కువగా ఎండ తీవ్రత జనాన్ని ఉడికిపోయేలా చేసింది. క్రితం ఏడాది ఏప్రిల్‌ నెలలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత పదేళ్ల రికార్డుగా ఉంది.  హైదరాబాద్‌ చరిత్రలోనే ఏప్రిల్‌ నెలలో అత్యధిక వేడి సంవత్సరంగా ఇప్పటివరకు రికార్డుల్లో ఉన్న 1973 నాటి రికార్డు చెరిగిపోనుంది. ఎండల తీవ్రత చూస్తే అటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అసాధారణ ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణ శాఖ వేడిగాలుల హెచ్చరిక జారీ చేసింది.

Other News

Comments are closed.