లక్ష దాటిన హరీష్ రావు మెజార్టీ.. 1,06,816

share on facebook

హైదరాబాద్ : తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు.. వరుసగా ఆరోసారి విజయం సాధించారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొంది.. టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన సిద్దిపేటలో మరోసారి గులాబీ జెండాను రెపరెపలాండిచారు హరీష్ రావు. హరీష్ రావు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మొదలు అపజయమన్నదే లేకుండా ఆధిక్యాలు పెంచుకుంటూ పోతున్న ఆయన ఈసారి లక్ష మెజార్టీని సాధించారు. ఈ ఎన్నికల్లో 1,06,816 ఓట్ల మెజార్టీ సాధించి తెలంగాణలో సరికొత్త రికార్డు సృష్టించారు.
పోలైన ఓట్లలో 80 శాతానికి పైగా ఓట్లు హరీష్ రావుకు పోలయ్యాయి.

పోలింగ్ రోజున కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజమయ్యాయి. బావా మీకు లక్ష మెజార్టీ ఖాయమన్న ఆ వ్యాఖ్యలు చరిత్రలో నిలిచిపోయాయి. 2004 ఉప ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీష్ రావు ఆ తర్వాత వరుస విజయాలు సాధిస్తూనే ఉన్నారు. 2008 ఉప ఎన్నిక, 2009 సాధారణ ఎన్నికలు, 2010 ఉప ఎన్నిక, 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో హరీశ్ రావుకు 1,08,699 ఓట్లు వచ్చాయి.
హరీష్ రావు మెజార్టీలు
2004 ఉప ఎన్నిక – 24,594
2008 ఉప ఎన్నిక – 58,000
2009 సాధారణ ఎన్నికలు – 64,667
2010 ఉప ఎన్నిక – 93,858
2014 సాధారణ ఎన్నికలు – 95,328

Other News

Comments are closed.