లోక్‌సభలోనూ టిఆర్‌ఎస్‌దే విజయం:ఎంపి

share on facebook

మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో 16సీట్లు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం ఖాయమని  ఎంపి జితేదంర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్‌ ఎన్‌ఇనకల్లోనూ ఏకపక్షంగా ఉంటాయన్నారు. కేసీఆర్‌ పట్ల ప్రజల్లో నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. నాలుగేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో సీఎం కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసే ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా పట్టం కట్టారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో తామే సీఎం అభ్యర్థులమన్నవారంతా టీఆర్‌ఎస్‌ దాటికి ఓటమిపాలయ్యారన్నారు. ఓడిపోయిన కొందరు మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతున్నారని వాళ్లను ప్రజలు విశ్వసించబోరని అన్నారు . రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాతల కుటుంబల్లో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు.

Other News

Comments are closed.