వచ్చే ఎన్నికల్లో కలసి పోరాడుతాం

share on facebook

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతుంటే కేసీఆర్‌ మాత్రం ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సిపిఐ నేత కలవేన శంకర్‌ అన్నారు. ఎందుకు ముందే ఎన్నికలకు వెళుతున్నారో కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమస్యలను పకక్కన పెట్టి ఎన్నికకలు సిద్దం కావడం పలాయనవాదం కాక మరోటి కాదన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించటంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఐ నేత విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో భావస్వారూప్య పార్టీలతో కలసి పోరాడుతామని అన్నారు. రానున్న ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తులు కుదుర్చుకునేందుకు సీపీఐ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే తెజస, తెదేపాలతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.

 

Other News

Comments are closed.