వచ్చే ఎన్నికల్లో పొత్తులపై వారంలో స్పష్టత

share on facebook

రాహుల్‌తో భేటీ అయిన రఘువీరా
న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏ విధంగా ముందు కెళ్తుందో, ఏ పార్టీలతో పొత్తులు ఉంటాయనేది వారం రోజుల్లో తెలుస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. అయితే స్వతంత్రంగానే పోటీకి సిద్దంగా ఉన్నామని అన్నారు. అన్‌ఇన నియోజకవర్గా/-లో పోటీకి నేతలు ఉన్నారని అన్నారు. పొత్తులపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని తెలిపారు. పలువురు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షుడు  రాహుల్‌తో భేటీ అయ్యారు. అనంతరం రఘువీరా విూడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కాంగ్రెస్‌ చేస్తోన్న కార్యక్రమాలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో చర్చించినట్టు చెప్పారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. 2019లో రాష్ట్రానికి  ప్రత్యేక ¬దా రావాలనేదే తమ లక్ష్యమన్నారు. ¬దా రావాలంటే రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించాల్సిన రాజకీయ  విధానంపై రాహుల్‌తో లోతుగా చర్చించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి నేతలతో, పార్టీ సీనియర్లతో సేకరించిన అభిప్రాయాలను  రాహుల్‌ ముందు పెట్టామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ నిర్ణయాత్మక శక్తిగా ఉంటుందని తెలిపారు.

Other News

Comments are closed.