వర్షాలకు చెరువుల్లో చేరుతున్న నీరు

share on facebook

పెరిగిన భూగర్భ జలమట్టాలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ఎస్సారెస్పీ జళకళను సంతరించుకుంది. అలాగే వరుసగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటులు నిండాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగినా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు చేరలేదు. ఈ సీజనులో ఎస్సారెస్పీ రిజర్వాయర్‌లోకి ఇప్పటి వరకు అనుకున్న మేరకు నీరు చేరలేదు. అయితే వానలకు జిల్లాలోని చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. అనేక మండలాల్లో 30 శాతం కంటే ఎక్కువగా లోటు వర్షపాతం ఉంది. బోధన్‌ డివిజన్‌లో భారీ వర్షాలు, నిజామాబాద్‌ డివిజన్‌లో సాధారణం, ఆర్మూర్‌ డివిజన్‌లో అతి తక్కువ వర్షాలు పడడం విశేషం. అడపాదడపా వర్షాలే అయినా జిల్లాలో చాలా చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ఈనెలలో సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు పంటలకు జీవం వచ్చింది. భూగర్భజల మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. భారీగా వచ్చిన ఇన్‌ఫ్లోతో ఈ చెరువులకు సర్‌ప్లస్‌ కింద నిర్ణీత కెపాసిటీకి మించి నీరు చేరింది. దీంతో అలుగులు పోస్తున్నాయి. జిల్లాలో భారీ వర్షాలు కుకురిసిన నేపథ్యంలో ఈ సీజన్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కన్నా అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు 683.2 మి.విూ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 769.7 మి.విూ వర్షపాతం జిల్లాలోని మొత్తం 27 మండలాల్లో 7మండలాల పరిధిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. డిచ్‌పల్లి, వర్ని, ఎడపల్లి, నిజామాబాద్‌ సౌత్‌, నవీపేట్‌, జక్రాన్‌పల్లి, మోర్తాడ్‌ మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. మ రో 19 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇందులో ముప్కాల్‌, నిజామాబాద్‌ రూరల్‌, ఇందల్వాయి, ధర్పల్లి, బాల్కొండ, కమ్మర్‌పల్లి, మోపాల్‌, భీమ్‌గల్‌, రుద్రూర్‌, రెంజల్‌, సిరికొండ, నందిపేట్‌, బో ధన్‌, నిజామాబాద్‌ నార్త్‌, మాక్లూర్‌, కోటగిరి, ఏర్గట్ల , వేల్పూర్‌, ఆర్మూర్‌ మండలాలు ఉన్నాయి. మెండోరా మండలంలో లోటు వర్షపాతం నమోదైంది.

 

Other News

Comments are closed.