వర్షాలతో గోదావరికి జలకళ

share on facebook

అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం

భద్రాద్రికొత్తగూడెం,జూలై9(జ‌నం సాక్షి): గోదావరికి నీటిమట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో కలెక్టర్‌ రాజీవ్‌ గాందీ హన్మంతు పరిస్థితిని సవిూక్షిసు/-తున్నారు.ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్యి. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరికి జలకళ వచ్చి. భద్రాద్రి వద్ద గోదావరి నీటి మట్టం క్రమేపి పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే గోదావరి వరదలు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంత్‌ వరదలపై అధికారులను అప్రమత్తం చేశారు. ఆయా ప్రాంతాలలో సెక్టోరియల్‌ అధికారులను ఏర్పాటు చేశారు.ముందు జాగ్రత్త చర్యగా వరద ప్రభావిత ప్రాంతాలతకు బఫర్‌స్టాక్‌ను తరలించారు.ఏజెన్సీకి ఎగువ భాగంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిషా తదితర రాష్టాల్రలో భారీగా వర్షాలు కురుస్తు న్నాయి. దీంతో దిగువ భాగానికి వరద నీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగానే వచ్చింది. భద్రాద్రి వద్ద గోదావరి నీటి మట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు తెలియజేశారు. వరదలను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం.. గోదావరి వరదలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. భద్రాచలం జీసీసీ గోదాములో ముందస్తుగా ఆహార వస్తువులను సైతం నిల్వ ఉంచారు. బియ్యం, కిరోసిన్‌ తదితర వాటిని అందుబాటులో ఉంచారు. ముందస్తు చర్యల్లో భాగంగా దవళేశ్వరం నుంచి రెండు లాంచీలను భద్రాచలం తరలించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ లాంచీలను వినియోగించనున్నారు. ఇదిలా ఉండగా భద్రాచలం పట్టణంలో కరకట్ట స్లూయిస్‌లు తరచు లీక్‌ అవుతుండ టంతో వర్షాకాలం వరద నీరు పట్టణంలో చేరుకుంటుంది. ఇదే ముందే గమనించిన స్థానిక అధికారులు స్లూయిస్‌లను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు చేరింది. ప్రాజెక్టుల్లోకి వరదనీరు

రావడంతో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. కిన్నెరసాని రిజర్వాయర్‌లో నీటిమట్టం 397అడుగులకు చేరింది. అశ్వారావుపేట మండలం లోని పెదవాగు ప్రాజెక్టు నీటిమట్టం 4.5విూటర్లకు చేరింది. చర్ల మండలంలోని తాలిపేరు, ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టుల్లో వరదనీరు చేరడంతో నీటిమట్టాలు పెరుగు తున్నాయి. మొర్రేడు, గోధుమవాగు, పెదవాగు, తెల్లవాగు, మల్లన్నవాగు, కిన్నెరసాని, ఏడుమొలకలవాగు, జల్లేరు, చిన్నవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో అతిపెద్ద చెరువుగా ఉన్న సింగభూపాలెం చెరువులోకి భారీగా వరదనీరు చేరింది.

 

Other News

Comments are closed.