వర్షాలతో రైతులకు ఊరట

share on facebook

రైతుబందు,బీమా పథకాలతో భరోసా

అందుకే ఉత్సాహంగా ప్రగతి నివేదన సభకు పయనం : గుత్తా

నల్గొండ,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): ఇటీవలి వర్షాల వల్ల రైతులకు ఊరట కలిగిందని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి వెల్లడించారు. మిషన్‌కాకతీయ పథకం వల్ల చెరువులన్నీ పటిష్ఠంగా తయారయ్యాయని వాటిల్లో ప్రస్తుతం వర్షాలవల్ల నీరు చేరుతోందని, రైతుల కళ్లల్లో సంతోషం చూస్తున్నట్లు చెప్పారు. మిషన్‌ భగీరథ పథకంతో తాగునీటి సమస్యలు ఉండవన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశంలోనే ముందుండటం మనకు గర్వకారణమని చెప్పారు. ఈ రెండు పథకాలూ దేశంలో ఎక్కడా లేవన్నారు. ఇరవై నాలుగ్గంటలూ కరెంటు ఇచ్చి దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలువనున్నదని చెప్పారు. అందుకే ప్రజలు ముఖ్యంగా రైతులు ప్రగతి నివేదన సభకు స్వచ్ఛందగా తరలి వస్తున్నారని అన్నారు. వారేకెసిఆర్‌కు అండగా నిలిచారన్నారు. తమను ఆదుకుంటున్న నేతను చూద్దామని బయలుదేరుతున్నారని చెప్పారు. రైతుబంధు, బీమా పథకాలు రైతన్నల్లో భరోసా నింపాయని అన్నారు. రెండేళ్లలో మిగులు కరెంటును ఉత్పత్తిచేసి ఇతర రాష్ట్రాలకు అమ్ముకునేందుకు అవకాశం వస్తుందన్నారు. ప్రాజెక్టులు కట్టినా భూములు కోల్పోయిన వారిని కూడా ప్రభుత్వం ఆదుకుందని, ఎవరూ ఇవ్వని నష్టపరిహారం ఇచ్చామని పేర్కొన్నారు. పులిచింతల నిల్వ సామర్థ్యాన్ని పెంచడం వల్ల 3 ఎత్తిపోతల పథకాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ముంపునకు గురవుతున్న చిట్యాల, నడిగడ్డ గ్రామాలపైన సర్వే జరిపి పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకపోతే కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులుపూర్తయితే సమస్య తీరగలదన్నారు. కాంగ్రెస్‌, బిజెపిల విమర్వల్లో పసలేదన్నారు. వారికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు.

———

 

Other News

Comments are closed.