వాట్సాప్‌ మెసేజ్‌ చదివానా తెలియకుండా.. మేనేజ్‌ చేసే అవకాశం

share on facebook

న్యూఢిల్లీ,మార్చి12(జ‌నంసాక్షి): శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు. వాట్పాప్‌ వచ్చాక జీవితమే ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి  వెల్లింది. వాట్సాప్‌ మెసేజ్‌ రావడం ఒక ఎత్తయితే దానిని చదివామా లేదా అన్నది పంపిన వ్యక్తికి తెలిసిపోతుంది. ఇప్పుడు అలా చదివిన విషయాన్ని ఎదుటివారు గుర్తించకుండా కూడా వెసలుబాటు వచ్చింది.  విూ ఫ్టెండ్స్‌ లేదా బాస్‌ నుంచి వాట్సప్‌ సందేశం వచ్చింది. దాన్ని విూరు చదవాలి. కానీ చదివారన్న విషయం పంపినా వారికి  తెలియకూడదు. అదెలా సాధ్యం? మెసేజ్‌ చదవగానే బ్లూటిక్స్‌ కనిపిస్తాయి కదా అంటారా? అలా కనిపించకుండా చదవొచ్చు. వాట్స్‌పలో సందేశం పంపించగానే ఒక గ్రే టిక్‌ కనిపిస్తుంది. అవతలి వ్యక్తికి ఆ సందేశం చేరగానే రెండు గ్రే టిక్‌లు కనిపిస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తి మెసేజ్‌ ఓపెన్‌ చేస్తే ఆ గ్రే టిక్‌లు బ్లూ టిక్‌లుగా మారతాయి. అంటే అవతలి వ్యక్తి చదివాడని అర్థం. ఇది తెలియకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా చేయండి. వాట్స్‌పలో సందేశం రాగానే నోటిఫికేషన్‌ ప్యానెల్‌ను స్కోల్ర్‌ డౌన్‌ చేసి ఎరోప్లేన్‌ మోడ్‌ను ఆన్‌ చేయండి. ఇప్పుడు వాట్స్‌పలో వెళ్లి మెసేజ్‌ చదవండి. తరువాత వాట్సప్‌ క్లోజ్‌ చేయండి. తిరిగి ఎరోప్లేన్‌ మోడ్‌ను ఆఫ్‌ చేయండి. ఆఫ్‌లైన్‌లో విూరు వాట్స్‌పను ఓపెన్‌ చేసి మెసేజ్‌ చదివితే పంపిన వారికి విూరు చదివిన విషయం తెలియదు. బ్లూటిక్స్‌ కనిపించవు. అయితే వాట్స్‌పను పూర్తిగా క్లోజ్‌ చేసి ఎరోప్లేన్‌ మోడ్‌ను ఆన్‌ చేయాలి. సింపుల్‌గా బ్యాక్‌బటన్‌ నొక్కి క్లోజ్‌ అయింది అనుకుంటే సరిపోదు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌ యాప్‌ రన్‌ అవుతుంటే సింక్రనైజ్‌ అయి బ్లూటిక్స్‌ కనిపించే అవకాశం ఉంటుంది.

Other News

Comments are closed.