గుంటూరు,నవంబర్15(జనంసాక్షి): ఇరిగేషన్ అధికారులతో కలసి నరసరావుపేట నియోజకవర్గం రోంపిచర్ల మండంలో పంట కాలువలను గురువారం ఏపి స్పీకర్ కోడెల శివప్రసాద్, యువనేత డాక్టర్ కోడెల శివరామ్ పరిశీలించారు. ఈనేపథ్యంలో అధికారులను తీసుకుని నీళ్ల కోసం ఆందోళన చేస్తున్న రైతులను స్పీకర్ కలిశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన లస్కర్లను కాలవలపై పెట్టుకోవాలి. రైతుల పంటలకు నీటిని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వేసిన పంటలకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది…కొత్తగా రైతులు పంటలు వేయవద్దు. వారాబంధీ ద్వారా ప్రస్తుతం వేసిన ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. రైతులు సహకరించి అవసరమైన మేరకే నీళ్లు పెట్టుకుని కింద పోలాల రైతులకు సహకరించాలని కోరారు. రైతులు సంయమనం పాటించాలని, అందరికీ నీళ్లు ఇచ్చే బాధ్యత నాది అని స్పీకర్ కోడెల శివప్రసాద్ పేర్కొన్నారు.