వాహనదారులు నిబంధనలు పాటించాలి

share on facebook
– కరకగూడెం ఎస్సై నాగబిక్షం.
కరకగూడెం,ఆగస్టు12 (జనంసాక్షి): వాహనదారులు క్రమం తప్పకుండా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని కరకగూడెం ఎస్సై నాగబిక్షం  అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి బట్టుపల్లి గ్రామ శివర్లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వాహన దారుల ధ్రువ పత్రాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సి బుక్కు తోపాటు పొల్యూషన్ తదితర పత్రాలు కలిగి ఉండాలని అలాగే హెల్మెట్ ధరించకుండా ప్రయాణించరాదని తెలిపారు. అతి వేగంగా వాహనాలు నడపకూడదు అని ఆటో డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మందిని ఎక్కించుకోరాదు అని సూచించారు. అదే విధంగా పలువురు వాహనదారులకు ఈ-చలాన్ ద్వారా చలాన విధించారు. స్థానిక పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.