విజయవాడలో కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

share on facebook

 

 

విజయవాడ,జనవరి9(జ‌నంసాక్షి ): యాదవులకు రాజ్యసభ సీటు ఇవ్‌ఆలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించడంపై ఆంధ్రాలో యాదవ సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి మంగళవారం విజయవాడలో క్షీరాభిషేకం నిర్వహించారు. యాదవ కులస్తులకు రాజ్యసభ సీటు అవకాశం ఇస్తానని ఇటీవల కేసీఆర్‌ ప్రకటించిన నేపధ్యంలో యాదవ యువభేరి నాయకులు విజయవాడలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా యువభేరి నాయకులు మాట్లాడుతూ… రాజ్యసభ సీటుకు అభ్యర్థిని ప్రకటించేవరకు ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా క్షీరాభిషేకాలు నిర్వహిస్తామని, అభ్యర్థిని ప్రకటించాక అమరావతి నుంచి హైదరాబాద్‌ వరకు పాదయాత్ర చేసి కేసీఆర్‌కి కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదం అందిస్తామని ప్రకటించారు. సిఎం నిర్ణయం తమకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. తమవారికి రుణాలు, గొర్ల పంపకం చేపట్టడం ముదావహమని అన్నారు.

 

 

Other News

Comments are closed.