విజయవాడలో వెండికడ్డీలు స్వాధీనం

share on facebook

విజయవాడ,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): నగరంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పెద్దఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల వెండిని పట్టుకున్నారు. అలాగే 50 లక్షలు విలువచేసే వెండి దిమ్మెలను పట్టుకున్నారు. అలాగే రూ. 6 లక్షల నగదును స్వాధీనం చేసుకుని ఓ కారును సీజ్‌ చేశారు. కాగా… ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కాగా… ఈ వెండిని నర్సీపట్నం నుంచి సేలంకు తరలిస్తున్నట్టు గుర్తించారు.

 

Other News

Comments are closed.