విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

share on facebook

నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): పీఆర్‌సీ బకాయిలు చెల్లింపుతో పాటు ఆరోగ్యకార్డులు అన్ని ఆసుపత్రుల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ప్రతి 40పాఠశాలలకు ఒక ఉప విద్యాధికారి ఉండాలని లేదంటే నియోజకవర్గానికి ఒకరు ఉండేలా చూడాలని చెప్పారు. విద్యారంగంతో పాటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం సర్వశిక్షా అభియాన్‌ ఏర్పాటుచేసి పదిహేనేళ్లు గడిచినా సాధించిన అభివృద్ధి ఏవిూ లేదని పేర్కొన్నారు. విద్యారంగ సమస్యల పరిస్కారంలో తమఅభిప్రాయమాలను తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమ తరగతులు ఆయా గ్రామస్థుల సహకారంతో కొనసాగుతున్నాయని ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని వివరించారు. రాష్ట్రంలోని 10లక్షలకు పైగా ఉన్న దళిత విద్యార్థుల్లో 6 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని తెలిపారు. పనిచేయని ఉపాధ్యాయులను గుర్తించి చర్యలు తీసుకోవాలి కానీ ఉపాధ్యాయులందరుపనిచేయడం లేదని మాట్లాడటం సరైందికాదని వివరించారు.

 

Other News

Comments are closed.