. విద్యార్థులు బాగా చదువుకొని తల్లి తండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలి :తాడేపల్లి రమా సత్యనారాయణ

share on facebook
మీర్పేట్ ప్రాథమిక ఉన్నత పాఠశాల యందునోటు పుస్తకాల వితరణ
ఎల్బీ నగర్  (జనం సాక్షి ) విద్యార్థులు బాగా చదువుకొని తల్లి తండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని    తాడేపల్లి రమా సత్యనారాయణ    అన్నారు.   శనివారము  తాడేపల్లి రమా సత్యనారాయణ సేవాసమితి* సహకారం తో సుబ్రమణ్య ఈశ్వర రాజు  జ్ఞాపకార్థం , మీర్పేట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దాదాపుగా 900 నోటు పుస్తకాలు అందించారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లి తండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని    ముఖ్య అతిథిగా విచ్చేసిన తాడేపల్లి రమా సత్యనారాయణ  పేరుకొన్నారు. ఈ కార్యక్రమం లొ సంస్థ సభ్యులు  శ్రీరామ మూర్తి, ఆనంద్ ,  మీర్పేట్ బీజేపీ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్  పెండ్యాల నర్సింహా గారు*, స్థానిక కార్పొరేటర్ *పసునూరి బిక్షపతి చారి , ప్రధాన కార్యదర్శి గాజుల మధు , ఉపాధ్యక్షులు నగేష్ ,  ప్రధానోపాధ్యాయులు గంగాధర్ , ఉపాధ్యాయులు స్వరాజ్య లక్ష్మి, ఆంజనేయులు , పాఠశాల కమిటి సభ్యులు మనోహర్ , తిరుమల హిల్స్ అధ్యక్షులు రఘు శ్రీ. కాలనీ వాసులు రాజేందర్, నాగరాజు, శ్రీధర్, సత్యనారాయణ  పాల్గొన్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య ఈశ్వర రాజు  ఆత్మకు శాంతి కలగాలని.  ఇంతటి మంచి సేవ కార్యక్రమాన్ని చేసిన తాడేపల్లి రమా సత్యనారాయణ కి ధన్యవాదాలు తెలియజేశారు

Other News

Comments are closed.