విభజన చట్టంలోని హావిూలను కేంద్రం విస్మరించింది

share on facebook

కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించడం లేదు
కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌అలీ
హైదరాబాద్‌, జూన్‌14(జ‌నం సాక్షి) : విభజన చట్టంలోని హావిూలను కేంద్రం పట్టించుకోవడంలేదని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌అలీ ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హావిూల అమలుకు కృషి చేయడం సీఎం కేసీఆర్‌ మరిచారని, తెలంగాణ హక్కులను కేసీఆర్‌ కాపాడాలని డిమాండ్‌ చేశారు. హావిూల అమలుకు కేంద్రంపై కేసీఆర్‌ ఎందుకు ఒత్తిడి పెంచడంలేదని, కేంద్రంతో కేసీఆర్‌కు ఉన్న రహస్య ఒప్పందమేంటని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం వివరణ అన్యాయంగా ఉందని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టీరీ ఏర్పాటయ్యేలా చూస్తానని తెరాస ప్రభుత్వం చెప్పిందని, కానీ నేడు కేంద్రం ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని చెబుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రజల అవసరాలను అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి.. తరువాత వాటిని విస్మరించారని అన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా కేంద్రంతో దోస్తీ కడుతూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తీరు మార్చుకోవాలని లేకుంటే తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలు కేవలం తన సొంత లాభాలకోసమే చేస్తున్నాడని, తన ఆస్తులను పెంచుకొనేందుకు పాకులాడటం తప్ప తెలంగాణ ప్రయోజనాలకు కేసీఆర్‌ ప్రత్యేకంగా చేసిందేవిూ లేదని విమర్శించారు.

Other News

Comments are closed.