విమోచనపై నాలుగేళ్ల మౌనం వీడాలి

share on facebook

నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ వ్యాప్తంగా విమోన దినోత్సవం నిర్వహణపై నాలుగేళ్లుగా సిఎం కెసిఆర్‌ దీనిపై స్పందించక పోవడం రాజకీయం కాక మరోటి కాదని బిజెపి జిల్లా నాయకుడు ప్లలె గంగారెడ్డి అన్నారు. ఇదంతా ప్రజలను వంచించడం తప్ప మరోటి కాదన్నారు. కేవలం ఎంఐఎంపు సంతృప్తి పరచడానికి తెలంగాణ ప్రజలను వంచిండం తప్పమరోటి కాదన్నారు. ప్రజలు ఇప్పుడు నిలదీస్తున్నాసమాధానం చెప్పడం లేదన్నారు. కేసీఆర్‌ పూటకోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం చెబుతున్నది ఒకటి చేస్తున్నది మరొకటి అని పేర్కొన్నారు. అమరుల త్యాగాలను రాజకీయం చేయొద్దని కోరారు. సెప్టెబరు 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే విషయంలో ఇబ్బంది ఉంటే కనీసం కారణాలు చెప్పాలని అన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణాతో కలిపి పలు రాష్ట్రాలు విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధివిధానాలను రూపొందించి ప్రజల అభీష్టాలను గౌరవించాలని కోరారు. తెలంగాణ పోరాటానికి ఘనమైన చరిత్ర ఉందని, భారత దేశంలో విలీనానికి ముందు ప్రజలు పడ్డ బాధలు, మహిళలు ఎదుర్కొన్న అవమానాలు, అమరుల త్యాగాలు ఎన్నో ఉన్నాయని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. 17ను అధికారికంగా ప్రకటిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పడం వంచించడమేనని అన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన రోజు సెప్టెంబరు 17న తెలంగాణ విలీన ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ఇలా చేయడం తెలంగాణ గౌరవాన్నికాపాడుకుని అమరులను స్మరించుకోవడం అవుతుందని అన్నారు.

 

Other News

Comments are closed.