వివాహిత అనుమానాస్పద మృతి

share on facebook

భర్తపై అనుమానంతో అదపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్‌,మే16(జ‌నం సాక్షి): నగర శివారులోని  జిల్లెలగూడ మున్సిపాలిటీ పరిధిలోని దాసరినారాయణరావు కాలనీలో బుధవారం ఉదయం అనిత(30) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విూర్‌పేట సీఐ మన్మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అనిత భర్త యాదగిరి క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి యాదగిరి డ్యూటీకి వెళ్లగా అనిత తన కూతురు అక్షిత, కొడుకు మహేష్‌లతో కలసి ఇంట్లో నిద్రించింది. బుధవారం ఉదయం 6గంటలకు డ్యూటీ నుంచి తిరిగివచ్చిన యాదగిరి తన భార్య గాయాలతో మృతిచెంది ఉండడాన్ని గుర్తించాడు. దీంతో తన భార్యను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని స్థానికులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. మృతురాలి శరీరంపై గాయాలు ఉండడం, సంఘటన జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉండడంతో మృతిరాలి భర్త యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ సందర్శించారు. మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది

Other News

Comments are closed.