వైభవంగా శ్రీరామనవమి శోభాయాత్ర

share on facebook

గోషామహల్‌: శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీరాం యువసేన శోభాయాత్ర నిర్వహించింది. ఈ యాత్రలో శ్రీరామ్‌ యువసేన అధ్యక్షులు, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ధూల్‌పేటలోని రాణీ అవంతీ భాయి నగర్‌లో గల ఆకాశ్‌పురి హనుమాన్‌ ఆలయం నుంచి శ్రీరాముని శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీతారాముల విగ్రహాలకు పూజలు జరిపి ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. ఈ ర్యాలీలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.