వ్యాధుల సంక్రమణపై సర్వే

share on facebook

ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ
మహబూబ్‌నగర్‌,నవంబర్‌8 (జనం సాక్షి) : అసంక్రమిత వ్యాధుల గుర్తింపునకు సంబంధించి 30 ఏళ్లకు పైబడిన వారితో ఇంటింటికి వెళ్లి ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు గత ఫిబ్రవరి 1 నుంచి సర్వే చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ సర్వేతో వ్యాధి గ్రస్తులను గుర్తించి ముందస్తుగానే వారికి అవగాహన కల్పించి వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవడం, మరో వైపు వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి సరైన చికిత్స ప్రాథమిక స్థాయిలోనే అందించి మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో ఈ సర్వేకు వైద్య సిబ్బంది చర్యలు తీసుకుంది. ముఖ్యంగా బీపీ, షుగర్‌, క్యాన్సర్‌  వ్యాధుల బారినపడి మధ్య వయసులోనే 60 శాతం మంది మృతి చెందుతున్నట్లు గుర్తించారు. ఇందుక నుగుణంగా ఈ సర్వేతో వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రాథమిక
స్థాయిలో రోగాలను నియంత్రించేందుకు వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో 30 ఏళ్లపై బడినవారి నుంచే వైద్య సిబ్బంది సర్వే చేసి పూర్తి స్థాయి వివరాలను సేకరించారు. బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ లక్షణాలపై ఎన్‌సీబీ ప్రోగ్రాం సర్వేను ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు ఇంటింటికి వెళ్లి 30 ఏళ్లకు పైబడిన వారితో పూర్తి స్థాయి వివరాలు సేకరించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ప్రాథమిక స్థాయిలోనే వైద్యసేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రాథమిక స్థాయిలోనే రోగం గుర్తించి వైద్యసేవలు అందించడం వల్ల మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

Other News

Comments are closed.