శబరిమలపై నటుడు విపరీత వ్యాఖ్య

share on facebook

కేసు నమోదు చేసిన పోలీసులు
తిరువనంతపురం,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిందాపూర్వక వ్యాఖ్యలు చేసిన నటుడు కొల్లం తులసిపై రాష్ట్ర పోలీసులు శనివారంనాడు కేసు నమోదు చేశారు. కొల్లాంలో ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి తులసి మాట్లాడుతూ, శబరిమలకు వచ్చే మహిళలను రెండు ముక్కలు చేస్తామన్నారు. ‘ఒక ముక్క ఢిల్లీకి పంపుతాం. మరో ముక్కను తిరువనంతపురంలోని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కార్యాలయంలోకి విసిరేస్తాం’ అని అన్నారు. బీజేపీ సభ్యుడైన తులసి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాంలోని కుంద్ర నుంచి పోటీ చేశారు. వయసుతో నిమిత్తం లేకుండా మహిళందరికీ శబరిమల ఆలయ ప్రవేశానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు సెప్టెంబర్‌ 28న తీర్పు చెప్పింది. ఈ తీర్పును కేరళ ప్రభుత్వం  స్వాగతించగా, పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు నిరసనలకు దిగారు. మహిళల ప్రవేశంపై ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయాన్నే కొనసాగించాలని నిరసన ప్రదర్శకులు డిమాడ్‌ చేస్తున్నారు. ఈ దశలో తులసి వ్యాఖ్యలు కలకలం రేపాయి.

Other News

Comments are closed.