శబ్ద కాలుష్యంపై నగర పోలీసుల నజర్‌

share on facebook

మోతమోగితే కేసులు తప్పవు
హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): నగరంలో శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నగర్‌  పోలీస్‌ చట్టం ప్రయోగించి కేసులు నమోదు చేస్తున్నారు. బాజాబజంత్రీలు వ్యవక్తిగత జీవనానికి ప్రతిబందకం కాకుండా చర్యలు చేపట్టారు. పెళ్లిళ్లు, ఊరేగింపులు, జన్మదిన వేడుకలు, సంగీతకచేరీల వంటివి ధ్వని కాలుష్యంతో స్థానికంగా నివాసముంటున్న వారిని తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. పోలీసులకు సమాచారం ఇస్తే.. అక్కడికి వెళ్లి  సూమోటో కేసులు నమోదు చేస్తున్నారు. సంగీతం పేరుతో పగలూ, రాత్రి తేడా లేకుండా శబ్దకాలుష్యాన్ని పంచుతున్న వారిని… చట్టపరిధిలో బిగించేందుకు కాలుష్యాన్ని లెక్కగట్టే పరికరాలను వినియోగిస్తున్నారు. వాటిని సంగీత వాయిద్యాలు, మైకుల వద్ద ఉంచుతున్నారు. ఫంక్షన్‌హాల్స్‌, ఇతర సమావేశాలు, ఆలయాలు, ప్రార్థన మందిరాల ప్రవేశద్వారాల్లోనూ ఈ పరికరాలను అమరుస్తున్నారు. పరిమితికి మించిన శబ్దంతో ఇతరులను ఇబ్బంది పెట్టే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.  దీంతో విందులు, వినోదాలు చేసుకుంటున్న వారు పోలీసులు వెళ్లాక ఫిర్యాదుదారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు దాడులకు దిగుతున్నారు. ఇలాంటి వారిపట్ల కూడా పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇవి ఎక్కువగా ఉండే పశ్చిమ మండలం, ఉత్తర మండలంలోని వాటి నిర్వాహకులతో కొద్దిరోజుల క్రితం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. సంగీత¬రుపై ఫిర్యాదులొస్తే జరిమానాలతో పాటు జైలుశిక్ష తప్పదంటూ హెచ్చరించి పంపారు. ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడిన వారిని నేరుగా జైలుకు పంపుతామంటూ చెప్పారు.

Other News

Comments are closed.