శాంతిభద్రతల పరిరక్షణెళి ధ్యేయంగా ముందుకుసాగుతాం

share on facebook

– పోలీస్‌ వ్యవస్థలో ప్రజలు భాగస్వాములు కావాలి
– సైబర్‌ నేరాలపై టెక్నాలజీతోనే పట్టుసాధిస్తాం
– నేరరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం
– ప్రభుత్వ సహకారంతో పోలీస్‌ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తా
– నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్‌,నవంబర్‌11(ఆర్‌ఎన్‌ఎ): రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణెళి ధ్యేయంగా ముందుకు సాగుతామని నూతనంగా డీజీపీగా నియామకమైన మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన తనను కలసిని విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ పటిష్టంగా ఉందని, రాబోయే కాలంలో మరింత పటిష్టపర్చేందుకు కృషిచేస్తాని తెలిపారు. పోలీస్‌ వ్యవస్థలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.. ప్రజల భాగస్వామ్యంతో శాంతిబద్రత పరిరక్షణ మరింత సమర్థవంతంగా పరిరక్షించేందుకు వీలుంటుందన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం సహకారంతో పరిష్కరిస్తామని తెలిపారు.. నేరాలకు పాల్పడితే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ నేర రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దటంతో తన వంతు పాత్ర పోషిస్తాన్నని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు..
ప్రభుత్వ సహకారంతో పోలీసుల సమస్యలను పరిష్కరిస్తా..
తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌కు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయని మహేందర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం 18వేల కొత్త పోస్టులను భర్తీకి ఆదేశించింది.. వీటిన్నింటిని నింపుకొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమోషన్ల విషయంలో, ఇతర విషయాల్లోనూ ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతామని తెలిపారు. పోలీస్‌ అడ్మినిస్టేషన్‌లో విప్లవాప్తకమైన మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వం మానుంచి ఏ స్థాయిలో లక్ష్యాన్ని ఆదేశిస్తుందో ఆ మేరకు పనిచేస్తామన్నారు.
పోలీస్‌ల శ్రమను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పోలీస్‌ వెల్ఫేర్‌కుపెద్దపీట వేయటం జరుగుతుందని తెలిపారు. పని విధానాలు, వీక్లీ ఆఫ్‌ అన్నింటిని అమలు చేసేలా కృషిచేస్తామని తెలిపారు.
ప్రతిపౌరుడిలో భరోసా కల్పిస్తాం..
రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన భద్రతతోపాటు, ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించి ప్రతి పౌరుడికి భద్రత ఢోకలేకుండా.. పోలీసుల తమ వెంటే ఉన్నారన్న భరోసాను కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ఆదేశాలతో తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ ప్రజల్లో భాగస్వామ్యమైందని, అటు అభివృద్ధి కార్యక్రమాల్లో, సామాజిక కార్యక్రమాల్లోనూ పోలీస్‌వ్యవస్థ ముందుందని తెలిపారు. దీంతో పోలీసుల, ప్రజల మధ్యం మంచి సంబంధాలు ఏర్పడ్డాయన్నారు. రాబోయే కాలంలో పోలీస్‌ వ్యవస్థలో ప్రజలను భాగస్వాములు అయ్యేలా ప్రజలతో మరింత మమేకమయ్యేందుకు కృషిజరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదును సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తద్వారా పోలీస్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు.
టెక్నాలజీతో తిప్పికొడతాం..
మారుతున్న సమాజంలో టెక్నాలజీ ఎంతో కీలక భూమిక పోషిస్తుందని, నేరగాళ్లు టెక్నాజీలతో నేరాలకు పాల్పడుతున్నారని, అధునాతన టెక్నాలజీని పోలీస్‌శాఖ అందించుకొని నేరగాళ్ల ఆగడాలను
తిప్పికొడతామన్నారు. ఇప్పటికే సీసీ కెమేరాల ఏర్పాటులతో అత్యంత నిఘా వ్యవస్థనుఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమేరాలతో ఇప్పటికే అనేక దోపిడీలు, దొంగనాలను పరిష్కరించామన్నారు. ఈ తరహాలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి మరింత పటిష్ఠ నిఘాను పెంచుతామననారు. రాష్ట్రంలో సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ తెలిపారు. సైబర్‌నేరాలను ఆదిలోనే అరికడితే పెదపెద్ద నేరాలకు ఆస్కారం లేకుండా చేయవచ్చునని డీజీపీ అబిప్రాయపడ్డారు. తెలంగాణ సైబర్‌ టెక్నాలజీలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉందని, అత్యాధునిక సైబర్‌ ల్యాబ్‌ టెక్నాలజీని అందుబాటులోకి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. సైబర్‌ కైమ్స్ర్‌ ల్యాబ్స్‌ అన్ని జిల్లాలో ఏర్పాటు చేసి ప్రతియూనిట్‌ కూడా సైబర్‌ నేరాల అరికట్టడంలో ఆరితేరినట్లయితే ప్రజల్లో మరింత భరోసాను నింపగలుతామన్నారు.
పోలీస్‌ వ్యవస్థల మధ్య సమన్వయం పెంచుతాం
పోలీస్‌ వ్యవస్థలో సమన్వయం ప్రధానం. రాజధానిలో ఉండే ప్రజలంతా తాము హైదరాబాద్‌లోనే ఉన్నామన్న భావనలో ఉంటారు. కానీ మా పరిపాలన సౌలభ్యం కోసం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ అని మూడు కమిషనరేట్లు పెట్టుకున్నాం. సాధారణ ప్రజలకు ఇది తెలియదు. ఇప్పుడు ఒక్కో కమిషనరేట్‌లో ఒక్కోవిధమైన పనితీరు కాకుండా అంతా సమన్వయంతో పనిచేసేలా చూస్తాం. అప్పుడు పౌరులకు మరింత చేరువకాగల్గుతాం. రాష్ట్రవ్యాప్తంగా అర్బన్‌, కమిషనరేట్లు, రూరల్‌ ప్రజలకు ఒకేతరహా పోలీస్‌ సేవలందేలా సంస్కరణలు తీసుకొస్తాం.
షీటీంల బలోపేతంతో మహిళల్లో భరోసా కల్పిస్తాం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేసింది. జనాభాలో 50శాతం మహిళలుఉన్నారు. మహిళల పురోగతి, భద్రత ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ప్రగాఢంగా నమ్మి రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు షీటీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షీటీంల ద్వారా మహిళల్లో నమ్మకాన్ని నింపగలిగాం. దీంతో చాలా ప్రాంతాల్లో మహిళలు షీటీంలును ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో వీటిని పటిష్ఠం చేసి మరింత భద్రత పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నక్సలైట్ల ప్రభావం అంతగాలేదు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత తీవ్రవాద విషయంలో ప్రశాంతమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని సరిహద్దులో అడపాడదపా జరిగే నక్సలైట్ల కార్యకలాపాలను పోలీస్‌శాఖ పటిష్ఠంగా తిప్పికొట్టడం ద్వారా వారి చర్యలను అడ్డుకోగలిగాం. తీవ్రవాదం వైపు యువత ఆకర్షితులవకుండా ఉండటానికి యువతనందరిని ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం, ప్రత్యేక శిక్షణలు ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు పొందేలా చర్యలు తీసుకోవటం ద్వారా యువత తీవ్ర వాదంవైపు ఆకర్షితులు కాకుండా చూడవచ్చు. హింసను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవటం ద్వారా రాష్ట్రంలో నక్సలిజంను పూర్తిస్థాయిలో అరికట్టేలా చూడవచ్చునని పేర్కొన్నారు.
నిఘా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది..
రాష్ట్రంలో నిఘా వ్యవవస్థ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పటికే భారతదేశంలోనే పేరు ప్రతిష్టలు సాధించింది. రానున్న కాలంలో మారుతున్న పరిస్థితులకుఅనుగుణంగా మన నిఘా వ్యవస్థను మరింత
అభివృద్ధి చేసుకొని గ్లోబల్‌ పోలీసింగ్‌ విధానాలను అవలంభిస్తూ ముందుకు సాగుతామని నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.
మాది ఓ సాధారణ రైతు కుటుంబం..
తాను ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించానని, చిన్ననాటినుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని తన చదువును కొనసాగించానని తెలిపారు. 1962 డిసెంబర్‌ 3న జన్మించిన తాను ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించానని, వరంగల్‌ ఆర్‌ఈసీ నుంచి బీటెక్‌ (సివిల్‌) పూర్తిచేసి, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్‌ చదువుతుండగానే 1986లో ఐపీఎస్‌కు ఎంపికయ్యానని తెలిపారు.  జిల్లాల్లో వివిధ ¬దాల్లో పనిచేసి.. సైబరాబాద్‌ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా, గ్రేహౌండ్స్‌ ఐజీగా వ్యవహరించానని, 2014 జూన్‌ 2 నుంచి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా వ్యవహరించానని తెలిపారు. అనంతరం ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌, ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడళ్లను అందుకున్నానని, నేషనల్‌ పోలీస్‌ అకాడవిూలో ఫ్యాకల్టీగా పనిచేశాని తెలిపారు. యూఎస్‌, యూకే దేశాల్లో పోలీస్‌ వ్యవస్థపై అధ్యయనం చేసిరావటంతో పోలీస్‌వ్యవస్థపై మరింత పట్టు సాధించానని తెలిపారు.

Other News

Comments are closed.