శ్రీవారి గర్భగుడిలో పెరిగిన దీపం వెలుగులు

share on facebook

మరింత స్పష్టంగా స్వామివారి దర్శనం
తిరుమల,మార్చి12(జ‌నంసాక్షి):  ఎట్టకేలకు భక్తుల కోరికి మన్నించిన తిరుమల శ్రీవారు ఇక మరింత దేదీప్యమానంగా దర్శనిమిస్తున్నారు.  తిరుమల వెంకన్న మరింత కాంతివంతంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. భక్తుల సూచనల మేరకు గర్భగుడిలో నేతి దీపాల కాంతిని టీటీడీ పెంచింది. దీనికోసం ప్రత్యేకంగా ఇద్దరు ఏకాంగులను నియమించి దీపకాంతి తగ్గకుండా పర్యవేక్షణ చేయిస్తోంది. భక్తులు కేవలం కొన్ని క్షణాలు మాత్రమే దర్శించగలిగే శ్రీవారి మనోహరరూపాన్ని ఇప్పుడు మరింత వెలుగులో చూసి తరించేలా చేసశారు. ఆగమ నియమానుసారం శ్రీవారి గర్భగుడిలో విద్యుత్‌ దీపాలను వెలిగించరాదు. నేతి దీపాల వెలుగులోనే స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. దీంతో దీపకాంతి తగ్గకుండా మూలమూర్తికి పైభాగంలో వేలాడదీసిన రెండు దీపకుండీలతో పాటు కిందిభాగంలోని మరో రెండు దీపకుండీలలో వేకువజామున సుప్రభాత సేవలో, మధ్యాహ్యం 11గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు తోమాల సమయంలో నెయ్యిని నింపి కాంతి తగ్గకుండా చర్యలు తీసుకున్నారు. ఒత్తుల పరిమాణం పెంచి ఈ మూడు సమయాల్లో వాటిని ఎగదోస్తూ మరింత కాంతి వచ్చేలా చూస్తున్నారు. దీంతో స్వామివారు స్పష్టంగా కనిపిస్తున్నారు.  జయవిజయల నుంచే స్వామి విగ్రహం స్పష్టంగా కనిపిస్తుండటంతో భక్తులు సంతోషిస్తున్నారు.

Other News

Comments are closed.