సంక్రాంతికి 5వేల ప్రత్యేక బస్సులు

share on facebook

అమరావతి: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాతి కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్దమవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కు రాకపోకల కోసం 5వేల ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ప్రయాణికులకు సహకరించేందుకు ఆర్టీసీ అధికారులు, సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వచ్చేవారు కొన్ని విషయాల్ని గమనించాల్సిన అవసరముందని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు, ఎల్బీనగర్‌లో ఫ్లైఓవర్‌ పనుల కారణంగా బస్సులు కొంత ఆలస్యం అయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్‌ చేయించుకున్న వారికి బస్సు బయలుదేరే సమయాన్ని సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తామన్నారు. ఆర్టీసీ మొబైల్‌ యాప్‌ ద్వారా బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Other News

Comments are closed.