సంక్షేమంలో కెసిఆర్‌ను మించిన నేత లేడు

share on facebook

రైతుబంధుతో దేశానికి దిశానిర్దేశం చేశారు: ఎమ్మెల్యే
మెదక్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సంక్షేమంలో కెసిఆర్‌ను మించిన నేత లేడని మెదక్‌ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను పేదలు పెద్దన్నగా..,ఆడబిడ్డలకు మేనమామగా పిలుస్తున్నారన్నారు. రైతుబంధు ద్వారా కేంద్రం కూడా ఆదిశగా పనిచేసేలా చేయడంలో కెసిఆర్‌ విజయం సాధించారని అన్నారు.పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్‌ అని అన్నారు.  ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక ఇబ్బందులు రాకూడదనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రారంభించారని అన్నారు. ఆడ పిల్లలంటే ఇంటికి లక్ష్మి అని, వారిని మగ పిల్లలతో సమానంగా చదివించాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఇంగ్లిష్‌ విూడియం, రెసిడెన్షియల్‌ పాఠశాలలు స్థాపించి బాలికలకు నాణ్యమైన విద్యనందిస్తున్నారని చెప్పారు. గర్భిణులకు ప్రభుత్వ
ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య పరీక్షలతో పాటు ప్రసవం అనంతరం రూ.12 వేలు, కేసీఆర్‌ కిట్‌ను అందజేస్తున్నారని తెలిపారు. మహిళల కోసం మరిన్ని డ్వాక్రా పథకాలు ప్రారంభించి స్వయం ఉపాధితో అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో పేదలకు ఆదరణ పెరిగిందన్నారు. కొత్తగా ఏర్పడిన సర్పంచ్‌ల్లో సగం మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హావిూలు నెరవేర్చడానికి కృషి చేస్తానన్నారు.
రెవెన్యూ సిబ్బంది కల్యాణలక్ష్మి పథకంతో పాటు ఆరోగ్య భద్రత వంటి పథకాలను ప్రజలకు అందించడం లో ముందంజలో ఉండాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు.పట్టాదారు పాస్‌ పుస్తకాలు, భూ సమస్యలను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

Other News

Comments are closed.