సంక్షేమంలో కెసిఆర్‌ ముందున్నారు

share on facebook

తెలంగాణ అభివృద్ది జీర్ణించుకోలేకనే విమర్శలు: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి): సంక్షేమంలో దేశంలోనే కేసీఆర్‌ నంబర్‌వన్‌ నిలువడం తెలంగాణ రాష్ట్రానికే కాదు ప్రజలకు గర్వకారణమని ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌ అన్నారు. సీమాంధ్ర పాలనలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, వనరులు దోపిడీకి గురయ్యాయని తెలంగాణ వచ్చాక మన నిధులు, నీళ్లు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మన వారికే అందేలా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక పనికిరాని ప్రతిపక్ష పార్టీలు ఉనికి కోసం పాకులాడుతున్నాయని ఎద్దేవా చేశారు. వారి మాటలు ప్రజలు నమ్మే పరిస్ధితుల్లో లేరన్నారు. అభివృద్ధి ఎవరు చేస్తున్నారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతులకు రెండు పంటలకు ఎకరానికి రూ. 8 వేలు అందజేయనుందన్నారు. మునుపెన్నడూలేని విధంగా రాష్ట్రప్రభుత్వం రైతులకు ఎకరానికి రెండు పంటలకు రూ. 8వేలను అమలు అందజేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. రైతులకు పలు రకాల ప్రయోజనాలు చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలను చేపడుతుందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే వ్యవసాయ విస్తీర్ణ అధికారులను కూడా భారీ సంఖ్యలో నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇకపోతే కనుమరుగైన కుల వృత్తులకు మళ్లీ జీవం పోసి వారికి కేసీఆర్‌ సర్కార్‌ చేయూతనిస్తోందన్నారు. కుల, చేతి వృత్తులను బలోపేతం చేస్తే గ్రామాల్లో వలసలను నివారించి ప్రతీ కుటుంబం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమని అన్నారు. అందుకే కుల వృత్తుల సంక్షేమం కోసం కోట్లు వెచ్చిస్తున్నారని అన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు, గ్రామాల్లో ఉండే వారికి ప్రోత్సాహం అందించే దిశగా సర్కార్‌ కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే మత్య్సకారుల అభివృద్ధికి ఉచితంగా చేపపిల్లలు అందించడంతో పాటు వారి

జోవనోపాధికి ఉపయోగపడే చెరువుల్లోకి గోదావరి జలాలు తెప్పిస్తున్నట్లు తెలిపారు. అందుకే మిషన్‌కాకతీయ ద్వార చెరువులను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా చేప పిల్లలను పెంచేందుకు చిన్న చిన్న కుంటలు ఏర్పా టు చేయడం జరుగుతుందన్నారు. గత ఏడాది 25 వేల కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా 230 చెరువులు నింపామని, ఈ సారి తిరిగి గోదావరి జలాలతో చెరువులు నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పల్లె నుంచి పట్నం దాక అభివృద్ధి జరుగాలన్నదే కేసీఆర్‌ ఆకాంక్ష అన్నారు. గొల్ల, కురుమలు, నాయిబ్రాహ్మణ, రజక, కమ్మరి, కుమ్మరి, గీత, చేనేత, వడ్రంగా, విశ్వబ్రాహ్మణుల వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. ఇచ్చిన హావిూలే కాకుండా ప్రజల అభిప్రాయాలను తీసుకుని అ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రతీ పల్లెకు రోడ్డు సౌకర్యం కల్పిస్తుందన్నారు. ముఖ్యంగా దేశంలో నే రైతన్నకు భరోసా ఇచ్చేందుకు వ్యవసాయానికి సాయంగా ఎకరానికి రూ. 4 వేలు అందిస్తున్నది తెలంగాణ సర్కార్‌ అని గర్వంగా చెప్పారు

 

Other News

Comments are closed.