సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష

share on facebook

ఎన్నికలు ఎప్పుడయినా గెలుపు మాదే

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకులు పార్టీలోకి వస్తున్నారని, పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే జలగం వెంకట్రావు భరోసా ఇచ్చారు. తెలంగాణలో భవిష్యత్తు అంతా టీఆర్‌ఎస్‌ పార్టీదేనని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ఎన్నికలుఎప్పుడైనా విజం టిఆర్‌ఎస్‌దేనని అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు. బంగారు తెలంగాణలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎంతో మంది పేద పిల్లలు నేడు గురుకులాలలో కార్పొరేట్‌ స్థాయి విద్యను అభ్యసించడడం గర్వించదగిన విషయమన్నారు.

 

Other News

Comments are closed.