సచిన్‌ రికార్డును అధిగమించిన రోహిత్‌

share on facebook

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం భారత్‌-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన సునాయాస విజయం సాధించడంతో పాటు రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ పాక్‌ బౌలర్ల విూద విరుచుకు పడి 225 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పాక్‌ నిర్దేశిరచిన 237పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించగలిగారు. కెప్టెన్‌ రోహత్‌ శర్మ111 ,శిఖర్‌ ధావన్‌ 114 పరుగుల చేశారు. ఈ  మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డు సాధించాడు. దుబాయ్‌ గడ్డవిూద టీమిండియా సారథి స్థాయిలో శతకం బాదిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గతంలో కెప్టెన్‌ ¬దాలో దుబాయ్‌ మైదానంలో అత్యధిక పరుగులు(83) చేసిన రికార్డు కూడా రోహిత్‌దే. ఇప్పుడు తనరికార్డును తానే అధిగమించాడు. ఇప్పటివరకు దుబాయ్‌ వేదికగా హాంగ్‌కాంగ్‌ సారథి అన్షుమాన్‌ రత్‌ (73), ఇంగ్లాండ్‌ సారథి కుక్‌(80), దక్షిణాఫ్రికా సారథి జీసీ స్మిత్‌ (92)లు అత్యధిక పరుగుల సాధించారు. దీంతోపాటు ఇండియా-పాకిస్థాన్‌ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధికంగా 111 పరుగులు చేసిన రెండో సారథి రోహిత్‌ కావడం విశేషం.ఇంతకు ముందు ఈ రికార్డు సచిన్‌ తెందూల్కర్‌(93), మహమ్మద్‌ అజారుద్దీన్‌(100,101), మహేంద్రర సింగ్‌ ధోనీ(113)లపై ఉంది. రోహిత్‌ ఇదే జోరు కొనసాగిస్తే ధోనీని అధిగమించడం పెద్ద కష్టమేవిూ కాదని సీనియర్‌ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. నిన్న జరిగిన మ్యాచ్‌లో 19 శతకాన్ని నమోదు చేసిన రోహిత్‌.. వన్డేల్లో ఏడువేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ ఘనత సాధించిన తొమ్మిదో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ నిలిచాడు.

Other News

Comments are closed.