సమస్యలపై నిర్లక్ష్యమే సర్కార్‌ సమాధానంగా ఉంది: పల్లె

share on facebook

నిజామాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): మూడున్నరేళ్లుగా కెసిఆర్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హావిూని అమలు చేయలేక పోయిందని బిజెపి విమర్శించింది. కేంద్రం ఇచ్చిన ఇన్‌పుట్‌ సబ్సిడీని కూడా ఇతర మార్గాలకు మళ్లించారని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను వేరే దిక్కు మళ్లించి రైతులకు సహాయం అందించడం లేదని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా అవహేళన చేస్తోందన్నారు. రైతులు సుఖంగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని ప్రకటిస్తూ ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. రుణమాఫీ చేయడానికి ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని, కేంద్రం సహాయం అందించినప్పటికీ రాష్ట్ర వాటా నుంచి పైసా విదల్చలేదన్నారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన ఉద్యమిస్తున్న పట్టంఇచుకోని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని అన్నారు.

Other News

Comments are closed.