సమస్యలు పరిష్కరించకుండా నిందాలా?: డిసిసి

share on facebook

నిజామాబాద్‌,అక్టోబర్‌ 4 (జనంసాక్షి): రైతులకు రుణమాఫీ చేయని కేసీఆర్‌ మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయల పథకాలకు కోట్లు ఎలా కుమ్మరిస్తున్నారని డిసిసి చీఫ్‌ తాహిర్‌ బిన్‌  అన్నారు.  తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెడితే  చేసిందేమిటని అన్నారు. పాలించే దమ్ములేక  సమాధానం చెప్పుకోలేక పోతున్నారని మండిపడ్డారు. మిషన్‌ కాకతీయ అవినీతికి అడ్డాగా మారిందన్నారు.  రైతులకు రుణాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి కేసీఆర్‌, బతుకమ్మ పండుగకు మాత్రం నిధులు విడుదల చేసారని ఎద్దేవా చేశారు. పింఛన్లు, రెండు పడక గదుల ఇళ్లు, రైతు రుణమాఫీ అమలును ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదన్నారు.  కుటుంబ సంక్షేమం కోసం పథకాలు పెడుతున్నారంటూ ఆరోపించారు. కేంద్రం నిధులను సైతం దోచుకుంటున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోరి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. ప్రస్తుతం ఉద్యోగులకు కూడా సక్రమంగా జీతాలు చెల్లించలేని పరిస్థితి కొనసాగుతోందని అన్నారు.

Other News

Comments are closed.