సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కు వినతి.

share on facebook
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిస్క రించాలని మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని ఆర్ కె నగర్ కాలనీ వాసులు ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేశారు.వెంటనే స్పందించిన ఆయన మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ జిహెచ్ఎంసి,జలమండలి, శానిటేషన్ అధికారులతో
కలిసి పర్యటించారు.కాలనిలో పెండింగ్ లో ఉన్న రోడ్లు,పార్క్,డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని,సీనియర్ సిటిజన్స్ రీడింగ్ రూము తదితర సమస్యలు పరిష్కరించాలని కాలని వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో డిసి రాజు,ఈఈ లక్ష్మణ్,డీఈ మహేష్,ఏఈ సత్య,కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్,బద్దం పరిశురాం రెడ్డి,సతీష్ కుమార్,పిట్ట శ్రీనివాస్,రాముయాదవ్, గుండా నిరంజన్,నర్సింగ్ రావు,మోహన్ రెడ్డి,వినయ్ గౌడ్,సంతోష్ రాందాస్,సంధ్యా,వసంత, ఆర్ కె అసోసియేషన్ సభ్యులు సోమశేఖర్,రాఘవేంద్ర,రవికిరణ్, సంజయ్,సాయినాథ్,గుప్త,నహీంఖాన్, మణి,శివ కుమార్,సుందర్ తదితరులు పాల్గొన్నారు.
 

Other News

Comments are closed.