సమస్యల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్ల ఆందోళన

share on facebook

గుంటూరు,నవంబర్‌6(జ‌నంసాక్షి): సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. తమకు జీతాలు చెల్లించడం లేదని మండిపడ్డారు. రేపల్లె మండలంలోని విశ్వస్వరం,మోళ్ళగుంట హాస్పటల్స్‌ వద్ద

ఆశ వర్కర్లు యూనియన్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో హాస్పటల్‌ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. విశ్వస్వరం హాస్పిటలో మెడికల్‌ ఆఫీసర్‌కు డిమాండ్సతో కూడిన వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రేపల్లె మండలం ఆశ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు చెన్ను వీరలక్ష్మీ మాట్లాడుతు నెలనెలా జీతాలు ఇస్తామని గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం జిఓ 113 ఇచ్చారు కానీ జిఓలో పారితోషికాలపై సీలింగ్‌ పెట్టారని అన్నారు. దీన్ని వల్ల కష్టపడి పనిచేసినా పారితోషకాలు విడుదల కాలేదు కావున వెంటనే సీలింగ్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సంవత్సరానికి ఒక్క సారి ఇవ్వవలసిన యూనిఫామ్స్‌ కూడా ఇవ్వలేదు అని విమర్శించారు. చేసినా పనికి వేతనాలు,పారితోషకాలు ప్రతి నెల చెల్లించకపోతే పోరాటాలు చేస్తామన్నారు.

 

 

Other News

Comments are closed.